కోలీవుడ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ లో
కార్తీక్ సుబ్బరాజ్ ఒకరు. రీసెంట్ గా
కార్తీక్ సుబ్బరాజ్ 'జిగర్తాండ డబుల్ ఎక్స్' అనే సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్, ఎస్. జె
సూర్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం దీపావళి కానుకగా థియేటర్స్ లో విడుదలైంది. తమిళం తో పాటు తెలుగులో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇది ఒక గొప్ప
సినిమా అంటూ విమర్శల ప్రశంసలు సైతం అందుకుంది. సినిమాలో
కార్తీక్ సుబ్బరాజు మేకింగ్, సినిమాటోగ్రఫీ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. కాగా
కార్తీక్ సుబ్బరాజ్
హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్జ్
ఆస్కార్ విన్నర్ అయిన
క్లింట్ ఈస్ట్ వుడ్ కి చాలా పెద్ద ఫ్యాన్. అందుకే ఆయనకి ట్రిబ్యుట్ ఇస్తూ జిగర్ తండా డబుల్ ఎక్స్ మూవీలో కొన్ని సన్నివేశాలను పెట్టాడు. సినిమాని చూసిన
మూవీ లవర్స్ సోషల్ మీడియాలో క్లింట్ ఈస్ట్ వుడ్ ని టాగ్ చేసి..'
ఇండియా మీకు ట్రిబ్యూట్ ఇస్తూ మంచి సినిమాను తీశారు. మీరు వీలైతే జిగర తాండ డబుల్ ఎక్స్
సినిమా చూడండి' అంటూ వరుస పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ క్లింట్ ఈస్ట్ వుడ్ వరకు వెళ్లడంతో ఆయన టీం దీనిపై రెస్పాండ్ అయ్యారు." ప్రస్తుతం క్లింట్ ఈస్ట్ వుడ్ ఆయన డైరెక్ట్ చేస్తున్న జ్యురర్ 2
సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ గురించి క్లింట్ ఈస్ట్ వుడికి తెలుసు.
షూటింగ్ నుంచి ఫ్రీ అయ్యాక కచ్చితంగా
సినిమా చూస్తారు" అంటూ క్లింట్ ఈస్ట్ వుడ్ టీం రిప్లై ఇచ్చింది. జిగర్తాండ డబుల్ ఎక్స్ గురించి క్లింట్ వుడ్ కి తెలుసు, ఆయన త్వరలోనే
సినిమా చూస్తారు అని వాళ్ళ టీం నుంచి రెస్పాన్స్ రావడంతో
కార్తీక్ సుబ్బరాజ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇదే విషయాన్ని పంచుకున్నాడు." తనకు చాలా హ్యాపీగా ఉందని,
లెజెండ్ క్లింట్ ఈస్ట్ వుడ్ తన డబల్ ఎక్స్ సినిమాని త్వరలోనే చూడబోతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఆయనకున్న లక్షలాది అభిమానుల తరఫున ఈ సినిమాని నేను
హార్ట్ ఫుల్ గా డెడికేట్ చేస్తున్నాను.
సినిమా చూసి ఆయన ఏమంటారో వినడానికి వినేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ తన పేర్కొన్నారు
కార్తీక్ సుబ్బరాజ్.