బంపర్ ఆఫర్ కొట్టేసిన యోగి బాబు.. ఏకంగా ప్రభాస్ సినిమాలో?
స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు ఆయన. అయితే ఇక ఇప్పుడు ఏదైనా స్టార్ హీరో సినిమా తెరమీదకి వచ్చింది అంటే అందులో యోగి బాబు తప్పకుండా ఛాన్స్ దక్కించుకుంటున్నాడు. అయితే ఇన్ని రోజుల వరకు తమిళ డబ్ సినిమాలతో అటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యోగి బాబు ఇప్పుడు వరకు నేరుగా తెలుగు సినిమా మాత్రం చేయలేదు. కానీ ఇప్పుడు ఏకంగా నేరుగా తెలుగు సినిమా చేయబోతున్నాడట. అయితే ప్రస్తుతం యోగి బాబుకి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది అని తెలుస్తోంది.
ఏకంగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూ పాన్ ఇండియా హీరోగా ఎదిగిన బడా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసాడట. ఆ హీరో ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్నది తెలుస్తుంది. ఇక ఈ మూవీలో యోగి బాబు కూడా నటిస్తూ ఉన్నాడట. ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ప్రశాంత నీల్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకేక్కుతుంది డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం ఎప్పటినుంచో డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. హర్రర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ మూవీలో యోగి బాబు కూడా నటిస్తున్నారట.