లుక్ మార్చేసిన స్టార్ హీరో.. ఎవరో చెప్పుకోండి చూద్దాం?
పాత్రకు అవసరమైతే ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎవరైనా స్టార్ హీరో కొత్త సినిమా తీస్తున్నాడు అంటే ఆ మూవీలో హీరో లుక్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి కూడా ఎంతో ఆసక్తి కనబరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక స్టార్ హీరోకి సంబంధించిన కొత్త లుక్ సోషల్ మీడియాలోకి వస్తే అది నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక స్టార్ హీరో న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే వెనక నుంచి ఆ స్టార్ హీరోని చూసి ఏకంగా అభిమానుల సైతం గుర్తుపట్టలేకపోతున్నారు. ఆయన ఎవరో కాదు హీరో ధనుష్.
కోలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. అయితే ధనుష్ నటనకు ఎంత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఇప్పుడు కొత్త సినిమా కోసం లుక్ మొత్తం మార్చేసి చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. అయితే ధనుష్ కి అటు తెలుగులోను భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ధనుష్ నటించిన అన్ని సినిమాలు కూడా తెలుగులో డబ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ విల్లర్ సినిమా చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక ధనుష్ ప్రస్తుతం తన 50వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తూ ఉండగా ఇక ఈ సినిమాలో సరికొత్త లుక్ లో ధనుష్ కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది.