మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్
మూవీ 'గుంటూరు కారం'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ధమ్
మసాలా సాంగ్ ని రిలీజ్ చేయగా ఈ సాంగ్ కి
ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండు రోజుల క్రిందటే 'ఓ మై బేబీ' అనే సాంగ్ వచ్చింది. ఎందుకో తెలియదు సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. సాంగ్ నిడివి తక్కువ ఉండడం, ఇందులో కూడా ఎలాంటి విజువల్స్ చూపించకపోవడం,
తమన్ కంపోజిషన్ కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. దీనికంటే ముందు రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ విషయంలోనూ ఇదే జరిగింది. కాకపోతే సాంగ్ లో మహేష్ కు సంబంధించి కొన్ని
మాస్ పోస్టర్స్ ఉండడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ తాజాగా రిలీజ్ అయిన ఓ మై బేబీ సాంగ్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో థర్డ్ సింగిల్ విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ముందే జాగ్రత్త పడుతున్నారట మేకర్స్. గుంటూరు కారం థర్డ్ సింగిల్ ని ఈనెల 23న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. మునుపట్ల కాకుండా ఈసారి మాత్రం పాటతో పాటు కొన్ని విజువల్స్ ని
యాడ్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. అందుకే రేపటినుండి
అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్లో ఈ సాంగ్ షూటింగ్ జరగబోతోందని అంటున్నారు. ఇప్పటివరకు డిసప్పాయింట్ అయిన మహేష్ ఫ్యాన్స్ కోసం
మూవీ టీమ్ థర్డ్ సింగిల్ తో విజువల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు సమాచారం. త్వరలోనే థర్డ్ సింగిల్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై
ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబుని కంప్లీట్
మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ తో ఈసారి వింటేజ్ మహేష్ ని చూడబోతున్నామని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.