విజయ్ దేవరకొండ పై అసత్య వార్తలు ప్రచారం.. యూట్యూబర్ అరెస్ట్..?

Anilkumar
'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అక్కడ నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ స్పెషల్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. హీరోగా ఎదుగుతున్న సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ ఇంతటి స్థాయికి వచ్చిన విజయ్ దేవరకొండ పై తాజాగా ఓ వ్యక్తి అసభ్యకర వార్తలను ప్రసారం చేయగా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండ సినిమాలకు సంబంధించి ఓ వ్యక్తి అసభ్యకర వార్తలను ప్రసారం చేశాడు.


 సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ వేదికగా విజయ్ ను అవమానిస్తూ కొన్ని అసత్యపు వార్తలను ప్రచారం చేశాడు. అనంతపురంకు చెందిన వెంకట కిరణ్ అనే వ్యక్తి విజయ్ దేవరకొండ గౌరవాన్ని కించపరిచే విధంగా అతని సినిమాల్లోని హీరోయిన్లను అవమానిస్తూ చేసిన యూట్యూబ్ వీడియోలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు వెంటనే స్పందించి సదరు వ్యక్తి ఆచూకీ తెలుసుకొన్నారు. ఈ మేరకు కేసు నెంబర్ 2590/2023 గా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.


అరెస్ట్ చేసిన అనంతరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలని ఛానల్ ని డిలీట్ చేయించారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటివి చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇతనితోపాటు సెలబ్రెటీలపై టార్గెట్ గా ఎవరు వ్యాఖ్యలు చేసినా, మీడియా మాధ్యమాల్లో వాళ్లను అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇక ప్రస్తుతం గీత గోవిందం మూవీ ఫేమ్ పరశురాం దర్శకత్వంలో 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమా చేస్తున్నాడు. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: