ప్రశాంత్ నీల్ తర్వాత ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమాకి రెడీ అయిన ఎన్టీఆర్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక్క సినిమా చేస్తే ఒకే సినిమాతో ఐదు ఆరు భాషలను కవర్ చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నారు. దాంతోపాటు అలా ఒకేసారి నాలుగైదు భాషల్లో సినిమా విడుదల అయితే వారికి గుర్తింపు సైతం భారీగా వస్తుంది అని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోని టాలీవుడ్ ని ఇండస్ట్రీలో


ఉండే చాలామంది స్టార్ హీరోలందరూ కూడా వారు చేస్తున్న సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకేక్కిస్తున్నారు. ఇటీవల అర్ అర్ అర్  సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ తరువాత దేవర అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన


తర్వాత సినిమాని ఏ డైరెక్టర్ తో చేస్తాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏ డైరెక్టర్లను తన లిస్టులోకి చేర్చుకున్నాడు అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం తారక్ టాలెంట్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారట. ఆయన మరెవరో కాదు కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్న అట్లీ . ఎస్ అట్లీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక క్రేజీ సినిమాకు కమిట్ అయ్యాడట . అంతేకాదు అఫీషియల్ ప్రకటన రానప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ఈ సినిమాకి సంబంధించి వర్క్ మొత్తం ఫినిష్ చేసుకున్నారట . కధ విన్న ఎన్టీఆర్ ఫిదా అయిపోయి ఈ సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమా కూడా రాజారాణి టైపులో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ గా ఉండబోతుందట . కానీ చూద్దాం మరి చివరికి ఏమవుతుందో..  !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: