తల్లిదండ్రుల విడాకుల పై షాకింగ్ కామెంట్స్ చేసిన రోషన్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ల లో ఒకరికి ఆ పేరును సంపాదించుకుంది సుమ. సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది సుమ. అయితే సుమ నటుడు రాజీవ్ కనకాల ను పెళ్లి చేసుకుంది. వీరి ఇద్దరి కుమారుడు రోషన్ సైతం త్వరలోనే బబ్లుగం అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ కాబోతున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ని చాలా చురుకుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.


 ఇందులో భాగంగానే ఆయనకి సంబంధించిన కొన్ని రకాల విషయాలను అభిమానులతో పంచుకున్నాడు రోషన్. అయితే ఇంటర్వ్యూలో పాల్గొన్న రోషన్ కి తన అమ్మ నాన్న విడాకుల విషయం పై ప్రశ్న అదురైంది. అయితే ఈ ప్రశ్నకు రోషన్ సమాధానం చెబుతూ.. అమ్మానాన్నలు విడాకులు తీసుకుని విడిపోతున్నారు అంటూ అప్పట్లో చాలా రకాల వార్తల వచ్చాయి.. కానీ ఆ వార్తలను చూసి అమ్మానాన్న చాలా సరదాగా తీసుకున్నారు.. నవ్వుకుంటూ కబుర్లు కూడా చెప్పుకున్నారు.. అసలు మీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్తలు వస్తుంటే మీ ఇద్దరూ అంత సరదాగా నవ్వుకుంటున్నారు ఏం జరుగుతోంది అని వారిని అడిగాను..


 ఏకంగా నేను వారిద్దరినీ మీరు విరాకులు తీసుకోబోతున్నారా అంటూ డైరెక్ట్ గా అడిగేసాను అంటూ చెప్పాడు రోషన్. దీంతో మా అమ్మ ఛీ ఛీ ఏం మాట్లాడుతున్నావ్ రా అలాంటిదేమీ లేదని చెప్పారు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుపోతున్నారని చాలా సార్లు వార్తలు వచ్చాయి. అప్పుడు చాలా గందరగోళం ఉండేదని తర్వాత ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని అర్థమైందని రోషన్ తెలిపారు. అమ్మ నాన్నలు తరచూ గొడవ పడేవారు అంటూ కూడా వారి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి కానీ అందులో ఏమాత్రం నిజం లేదు అమ్మ నాన్న ఇద్దరు కూడా గొడవపడేవారు ఎలాంటి గొడవలు అంటే నాన్న తొందరగా లేకపోతే అమ్మ తిట్టేది ఇలా వీరిద్దరి మధ్య సరదాగానే గొడవలు సాగేవని చెప్పాడు రోషన్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: