బాలయ్య చిత్రంలో కుర్ర హీరోయిన్.. జాతకం మారేనా..?
ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని ప్రకటించలేదు.. కేవలం 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు.. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో కలర్ ఫోటో హీరోయిన్ చాందిని చౌదరి కూడా నటిస్తున్నట్లు సమాచారం. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు పలు సినిమాలలో అవకాశాలు వెలుపడ్డాయి.. కలర్ ఫోటో సినిమాతో వచ్చిన గుర్తింపుతో ఈమె విశ్వక్ నటిస్తున్న గామి సినిమాలో అవకాశాన్ని అందుకుంది.
ఇప్పుడు ఏకంగా బాలయ్యతో నటించే అవకాశాన్ని సైతం అందుకుంది. తాజాగా సెట్లో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేయడం జరిగింది. దీంతో ఈ విషయం కన్ఫర్మ్ అయ్యిందని చెప్పవచ్చు. చాందినీకి.. డైరెక్టర్ బాబి తో దిగిన ఫోటోలు షేర్ చేయగ తాను కూడా బాలయ్య సినిమాలో నటిస్తున్నట్లు చెప్పకనే చెప్పేసింది. కలర్ ఫోటో సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరసగా అవకాశాలు వస్తూ అభిమానులను పెంచుకుంటూనే ఉన్నది. అయితే అనుకున్నంత స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేక పోయింది చాందిని చౌదరి మళ్ళీ ఇప్పుడు సినిమాలలో బిజీ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బాలయ్యతో సీమ అవకాశం రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.