స్టార్ హీరో సినిమాని రిజెక్ట్ చేసిన లవ్ టుడే హీరోయిన్..!!

Divya
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్లో వచ్చిన లవ్ టుడే సినిమా ఎంతటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ప్రస్తుతం ఉన్న సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించడం జరిగింది.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో యూత్ అని బాగా ఆకట్టుకుంది. రొమాంటిక్ కామెడీ అంశాలతో ఈ సినిమా మోడ్రన్ లవ్ డ్రామాగా తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో ప్రదీప్ కి కూడా మంచి పేరు రావడంతో పాటు హీరోయిన్ ఇవానాకి కూడా అంతే గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఇవానా కి వరుసగా హీరోయిన్గా ఆఫర్లు అయితే వస్తూ ఉన్నాయి.. రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ యంగ్ బ్యూటీ తో సినిమాలు చేసేందుకు కూడా దర్శక నిర్మాతలు ఆసక్తిగా చూపడంతో ఒక డైరెక్టర్ ఇవానాని స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశాన్ని ఇవ్వగా ఆమె రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.. ఆ హీరో ఎవరో కాదు తమిళ దళపతి విజయ్.. ఈ హీరోతో నటించడానికి ఆమె నో చెప్పిందట. ప్రస్తుతం డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ఒక సినిమాలో ఆఫర్ రావడం చేత ఎందుకో ఈమె రిజెక్ట్ చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక సరైన కారణం ఉందని సమాచారం.ఇవానాకి అవకాశం వచ్చింది హీరోయిన్గా కాదు విజయ్ చెల్లెలి పాత్రలో నటించమన్న అందుకే ఆమె రిజెక్ట్ చేసినట్లు సమాచారం. హీరోయిన్గా ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్స్ అందుకుంటున్న సమయంలో విజయ్ పక్కన చెల్లెలుగా నటిస్తే ఆ తరహా పాత్రలే వస్తాయని చెప్పి ఈమె భయపడి విజయ్ మూవీలో ఇవాన సినిమాని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తున్నది. మరి ఈ సినిమా విషయంపై ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: