ఏంటి జెర్సీ సినిమా వెంకటేష్ చేయాల్సిందా..!!

Divya
నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం హాయ్ నాన్న.. ఈ చిత్రంలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటించింది. ఫాదర్ సెంటిమెంటుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రేపటి రోజున రాబోతోంది.ముఖ్యంగా ఎమోషనల్ బాండింగ్ టచ్ తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాని వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఇటీవలే యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ వంగా తో ఇంటర్వ్యూ చేసిన నాని తాజాగా సైంధవ హీరో వెంకటేష్ తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది.
సైంధవ సినిమా కూడా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఉంటుందని తెలియజేయడం జరిగింది.. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వెంకటేష్ నానికి కూడా తెలియని ఒక విషయాన్ని సైతం బయట పెట్టేశారు.. అదేమిటంటే నాని నటించిన జెర్సీ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో నాని మరో మెట్టు పైకి ఎక్కారని చెప్పవచ్చు.. అయితే నాని నటించిన ఈ సినిమా మొదట వెంకటేష్ చేయాల్సిందట..

ఈ సినిమా కథ కూడా ఆయన కోసమే రాశారట. కానీ ఎందుకో అది సెట్ అవ్వలేదని ఈ విషయాన్ని వెంకటేష్ చెప్పే వరకు నానికి కూడా తెలియదట. జెర్సీ సినిమా క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ కథాంశంతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపిస్తూ ఉంటారు. ఈ సినిమాలో నాని నటన అద్భుతంగా చేశారు.ఒకవేళ ఈ సినిమాని వెంకటేష్ చేసి ఉంటే ఎలా ఉండేదో అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా విషయానికి వస్తే కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేస్తూ ఉన్నారు. వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా అని డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈ సినిమా జనవరి 13న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: