13 వారాలకు.. గౌతమ్ కృష్ణ ఎంత సంపాదించాడో తెలుసా?

praveen
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారిపోయిన అంశం ఒకటే. అదే ప్రేక్షకులను వినూత్నమైన రీతిలో అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్. ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో మొదటి నుంచి అందరిలో అంచనాలను పెంచేసిన ఈ షో అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం వినూత్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అని చెప్పాలి. ఇక ఇప్పటికే 13 వారాలను పూర్తి చేసుకుంది ఈ షో. మరో రెండు వారాల్లో ఇక ఈ సీజన్ విజేత ఎవరు అనే విషయం కూడా తేలిపోతుంది అని చెప్పాలి.

 కాగా ప్రస్తుతం బిగ్ బాస్ షో టాప్ సెవెన్ కి చేరుకుంది.  హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకున్న గౌతం 13వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరైనా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు అంటే చాలు వారికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా హౌస్ లో ఉన్నన్ని రోజులు వారానికి ఆయా కంటెస్టెంట్స్ ఎంత పారితోషకం తీసుకున్నారు అన్నది కూడా తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.

 ఈ క్రమంలోనే ఇటీవల 13వ వారం లో ఎలిమినేట్ అయిన గౌతం కృష్ణ ఎంత పారితోషకం తీసుకున్నాడు అన్నది వైరల్ గా మారిపోయింది. అయితే వారానికి 1.75 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడట గౌతమ్. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న 13 వారాలకు గాను 22.75 లక్షల రూపాయలు పారితోషకం అందుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇన్ని వారాలపాటు హౌస్ లో కొనసాగినప్పటికీ.. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో పోల్చి చూస్తే గౌతమ్ కృష్ణకు కాస్త తక్కువ పారితోషకం అందింది అని చెప్పుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: