ఈ సాక్సులు వేసుకుంటే.. మీరు ఇక ఏ సినిమా మిస్ అవ్వరు?
అయితే సాధారణంగా ఎంతోమంది నెట్ ఫ్లిక్స్ లో ఇక వెబ్ సిరీస్ లను లేదా సినిమాలను చూడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఖాళీ సమయం దొరికినప్పుడే ఇలా మిస్సయిన షోస్ అన్నిటిని కూడా చూస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు సినిమాలు వెబ్ సిరీస్ లనూ చూస్తూనే నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో టీవీలో సినిమాలు ముందుకు సాగుతూనే ఉంటాయి. దీంతో ఇక మళ్ళీ నిద్ర లేచిన తర్వాత అయ్యో పూర్తి సినిమా చూడలేకపోయామే అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ నుంచి అలా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు.
వినియోగదారులు నెట్ ఫ్లిక్స్ లో సినిమా కానీ ప్రోగ్రాం కానీ చూస్తూ నిద్రపోతే ఆ మూవీ లేదా ప్రోగ్రాంనీ మిస్ అవ్వకుండా ఉండేందుకు ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త సాక్సులు అందుబాటులోకి వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ ద్వారా సినిమాలు చూసేటప్పుడు ఈ సాక్సులను కాళ్లకు ధరించాలి. ఇలా చూస్తున్నప్పుడు మధ్యలో నిద్రపోతే సాక్షుల్లోని సెన్సార్లు ప్రోగ్రాం ని వెంటనే ఆపేస్తాయ్. దీంతో నిద్రలేచిన తర్వాత మీరు ఎక్కడి వరకు అయితే చూసి ఆపేశారో.. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు. మనిషి యొక్క కదలికలను దృష్టిలో పెట్టుకుని ఈ సాక్సులు పనిచేస్తాయట. ఒకవేళ టీవీ చూస్తున్నప్పుడు కదలకుండా అలాగే కూర్చున్న అవి టీవీని ఆఫ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట.