మ్యాడ్ సవాల్ ను అనుకరించిన నితిన్ !
ఈసినిమానుప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ ఈసినిమాకు సంబంధించి ఇచ్చిన గ్యారెంటీ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. గతనెలలో వచ్చిన ‘మ్యాడ్’ అనే చిన్నసినిమాను ప్రమోట్ చేస్తూ ఆమూవీ నిర్మాత ఒక వెరైటీ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం వచ్చిన ‘జాతిరత్నాలు’ మూవీలో కంటే ‘మ్యాడ్’ మూవీకి వచ్చిన ప్రేక్షకులు తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ ఇచ్చేస్తానని సవాల్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ‘మ్యాడ్’ మూవీలో కామెడీ బాగా ఉండడంతో ప్రేక్షకుల నుంచి పెద్దగా ట్రోలింగ్ రాలేదు ఇప్పుడు అదే ఛాలెంజ్ ని అనుసరిస్తూ నితిన్ ఒక వెరైటీ ఛాలెంజ్ చేశాడు. ‘మ్యాడ్’ సినిమా చూసి ప్రేక్షకులు నవ్వకపోతే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తానని నిర్మాత నాగవంశీ అన్నాడని తాను కూడ తన సినిమా విషయంలో అలాంటి సవాల్ చేస్తున్నానని ఆసినిమా చూసి ప్రేక్షకులు నవ్వకపోతే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తానని అంటూ సవాల్ చేశాడు.
దీనితో తమ సినిమా చూసి నవ్వకుంటే టికెట్ డబ్బులు వాపస్ సవాల్ మళ్ళీ రిపీట్ అయింది. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈచిత్రం డిసెంబరు 8న ఈవారం విడుదలకాబోతున్న పరిస్థితులలో నితిన్ ఛాలెంజ్ కి సగటు సినిమా ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి. రణబీర్ కపూర్ ‘యానిమల్’ మూవీకి రివ్యూలు అంతంత మాత్రంగా వచ్చినప్పటికీ ఈమూవీకి మ్యానియా కొనసాగుతున్న పరిస్థితులలో నాని నితిన్ లు ఈడబ్బింగ్ సినిమా వేవ్ కు ఎలాంటి అడ్డుకట్ట వేస్తారో చూడాలి..