డంకీ నుండి సాలిడ్ అప్డేట్ కావాలి అంటున్న ఫ్యాన్స్..!

Anilkumar
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఈ   ఏడాది చివర్లో రాబోతున్న 'డంకీ' తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. డంకీ రిలీజ్ కి నెల రోజుల కంటే తక్కువ సమయం ఉండడంతో మూవీ టీం సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ వస్తోంది. కానీ ఈ ప్రమోషనల్ కంటెంట్ తో మేకర్స్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయారు. బాలీవుడ్ లో బెస్ట్ ఫిలిం మేకర్ గా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ హిరానీ లాంటి స్టార్ డైరెక్టర్ తో షారుక్ ఖాన్ సినిమా చేస్తున్నారంటే వీరి కాంబినేషన్ పై 


బాలీవుడ్ లో భారీ అంచనాలను నెలకొన్నాయి. కానీ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటివరకు మూవీ టీం సినిమా నుంచి డ్రాప్ 1, డ్రాప్ 2, డ్రాప్ 3.. అంటూ టీజర్, రెండు సాంగ్స్ విడుదల చేసింది. వీటిలో టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన డ్రాప్ 2, డ్రాప్ 3 రెండు పాటలు ఆడియన్స్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అంతేకాదు షారుక్ ఇటీవల సినిమాలైనా పఠాన్జ్ జవాన్ లతో పోలిస్తే డంకీ మూవీకి ఆడియన్స్ లో చాలా తక్కువ బజ్ ఉంది. ఇలాంటి సమయంలో సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ వస్తే కచ్చితంగా 


అది సినిమాపై హైప్ ని క్రియేట్ చేయగలదు. ఆ సాలిడ్ అప్డేట్ మరేదో కాదు ట్రైలర్ మాత్రమే. డంకీ మూవీకి కాంపిటీషన్ గా వస్తున్న 'సలార్' మూవీ ట్రైలర్ రాజాగా రిలీజ్ అయి ఆడియన్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయినా కూడా ప్రస్తుతం సలార్ కి ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక త్వరలోనే డంకీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రైలర్ తో మేకర్స్ ఆడియన్స్ దృష్టిని ని ఆకర్షించగలిగితే డంకీ తో షారుక్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమని చెప్పొచ్చు. మరి త్వరలో రిలీజ్ కాబోయే డంకీ ట్రైలర్ ఆడియన్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: