తమిళ నటుడు కార్తీ తాజాగా
జపాన్ అనే
మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో మోస్ట్
బ్యూటిఫుల్ నటీమని అను ఇమ్మాన్యూయల్
హీరోయిన్ గా నటించగా ... రాజు మురుగన్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ
మూవీ కొన్ని రోజుల క్రితమే
థియేటర్ లలో విడుదల అయింది. ఈ
మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకే రోజు విడుదల అయింది. ఈ
మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువ కలెక్షన్ లను రాబట్టింది. ఇకపోతే ఈ
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలక్షన్ లను వసూలు చేసింది. అలాగే ఎంత మేర నష్టాలను అందుకుంది అనే విషయాలను తెలుసుకుందాం.
ఈ
మూవీ నైజాం ఏరియాలో 1.24 కోట్ల కలెక్షన్ లాంజ్ వసూలు చేయగా ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక మొత్తంగా ఈ
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.79 కోట్ల షేర్ ... 5.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 6 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ
మూవీ 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో
బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజే భారీ స్థాయిలో నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి. ఇకపోతే ఈ
మూవీ కి మొత్తంగా 3.71 కోట్ల నష్టాలు వచ్చినట్లు సమాచారం. దానితో ఈ
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ డిజాస్టర్ ను అందుకుంది.