దుమ్ము దులిపెస్తున్న సలార్ మూవీ ట్రైలర్..!!

Divya

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైడెడ్ చిత్రం సలార్.. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గతంలో విడుదలైన పోస్టర్లు టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఆ సమయం రానే వచ్చేసింది కొన్ని నిమిషాల క్రితం సలార్ సినిమా ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకి మరింత హైప్ పెరిగిపోతొంది.

భారీ అంచనాల మధ్య డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముందు నుంచే భారీ హైట్ ఉండడంతో ట్రైలర్ విడుదల కావడంతో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ చిత్రం అన్నట్లుగా కనిపిస్తోంది. హోం భలే ఫిలిమ్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా భారీ బడ్జెట్ తోనే చిత్రీకరిస్తున్నారు. సలార్ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని పలువురు అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు.

ప్రభాస్ కూడా ఈ ట్రైలర్లో చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ మొత్తం కూడా ఇద్దరి స్నేహితుల మధ్య అనుబంధాన్ని గుర్తుచేసేలా కనిపిస్తోంది. కే జి ఎఫ్ సినిమాకి లింకు ఉన్నట్లుగా కూడా చూపించారు డైరెక్టర్. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని ట్రైలర్లో చూపించడం జరుగుతోంది.యాక్షన్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించి నట్లుగా కనిపిస్తోంది. ప్రభాస్ ఎంట్రీ కూడా చాలా స్టైలిష్ గా చూపించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ మాత్రం దుమ్ములేపుతోందని చెప్పవచ్చు. ఇందులో ప్రభాస్ దేవాగా కూడా కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: