తగ్గిపోతున్న ట్విట్టర్ మీడియా హవా..!!

Divya
చాలా మంది సెలబ్రిటీలు మీడియా పేజీ వారు ఎక్కువగా ట్విట్టర్ల నే అనుసంధానిస్తూ ఉంటారు. ఎలాంటి విషయాలైనా సరే ఇందులో ఎక్కువగా పోస్ట్ షేర్ చేయడం జరుగుతోంది.. అయితే గత కొద్ది రోజుల క్రితం నుంచి ట్విట్టర్ లో ఏదైనా పోస్ట్ చేయాలంటే చాలా రకాల కండిషన్స్ సైతం ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చార్జెస్ కూడా చేస్తూ ఉండడంతో పలు రకాల మీడియా సంస్థలు ట్విట్టర్ల లో పోస్టులను చేయడం ఆపివేసినట్లు కొన్ని నివేదికలు సైతం తెలియజేస్తున్నాయి.
ఇలాంటి వారితో పాటు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఎక్కువగా ఇంస్టాగ్రామ్ మరియు ఫేస్ బుక్ లోనే చాలా యాక్టివ్ గా ఉంటున్నారట.. ముఖ్యంగా హాలీవుడ్ సెలబ్రిటీస్ హాలీవుడ్ మీడియా సంస్థలు కూడా ఇలాంటి వాటికి ఎక్కువ మక్కువ చుపుతున్నట్లు ఒక నివేదికలో తెలియజేయడం జరిగింది. చాలా మంది ప్రజలు కూడా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ ఫేస్ బుక్ నే ఉపయోగిస్తూ ఉన్నారు. అందుచేతనే వారిని దృష్టిలో పెట్టుకొని వీరు కూడా ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ లోనే యాక్టివ్ గా ఉంటున్నట్లు సమాచారం.

ముఖ్యంగా మార్వెల్ స్టూడియోస్, సోనీ పిక్చర్స్ ,డిస్నీ, వార్నర్ బ్రదర్, HBO, లయన్ గేట్స్ ఇతరత్రా టెలివిజన్ వంటివీ కూడ ఈ మీడియా పేజీలని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎక్కువగా ట్విట్టర్ ని చాలా మంది ఫాలో అయ్యేవారు.. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ లనే ఉపయోగిస్తూ ఉండడంతో ఇలాంటి బడా సంస్థలు కూడా వీటిని తమ యూజర్స్ కి అనుగుణంగా వీటిలో కూడా ఎక్కువగా పోస్టులు చేస్తూ అభిమానులను మరింత చేరువయ్యేలా చేస్తూ ఉన్నారు. అయితే మరి రాబోయే రోజుల్లో ఇలాగే అయితే ట్విట్టర్ కు చాలా దెబ్బ పడే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. వారి రాబోయే రోజుల్లో నైనా ట్విట్టర్ సంస్థ పలు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: