11 రోజుల్లో "మంగళవారం" కి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ నటీమణులలో ఒకరు అయినటువంటి పాయల్ రాజ్పుత్ తాజాగా మంగళవారం అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకి తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ఇప్పటి వరకు 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 11 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ సినిమాకు 11 రోజుల్లో నైజాం ఏరియాలో 3.83 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.38 కోట్లు , యు ఏ లో 1.09 కోట్లు , ఈస్ట్ లో 66 లక్షలు,  వేస్ట్ లో 45 లక్షలు , గుంటూరు లో 62 లక్షలు , కృష్ణ లో 44 లక్షలు , నెల్లూరు లో 29 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమా 11 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.76 కోట్ల షేర్ ... 16.10  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ కి 11 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 1.33 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇక ఈ మూవీ కి మొదటి 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 10.09 కోట్ల షేర్ ... 18.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు 12 కోట్ల మేర ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 13 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ లెక్కన బట్టి చూస్తే ఈ సినిమా మరో 2.91 కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: