కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సుధా కొంగర కామెంట్స్..?

Anilkumar
గురు, ఆకాశం నీ హద్దురా వంటి సినిమాలతో అగ్ర దర్శకులకు సమానంగా పేరు తెచ్చుకుంది సుధా కొంగర. అలాంటి ఈ లేడీ డైరెక్టర్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తమిళ ఆడియన్స్ సోషల్ మీడియాలో ఈమెను ట్యాగ్ చేస్తూ వరుస పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, డైరెక్టర్ అమీర్ తెరకెక్కించిన 'రామ్' అనే సినిమా 2005లో రిలీజ్ అయింది. కోలీవుడ్ హీరో జీవా లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ తమిళంలో మంచి హిట్ అయింది. ఈ సినిమాని చూసేందుకు అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న హీరో కార్తీ, సుధా కొంగర, స్టూడియో గ్రీన్ అధినేత కేఈ జ్ఞానవెల్ రాజా థియేటర్ కి వెళ్లారట. 

ఇక సినిమా చూసిన సుధా కొంగర అసలు సినిమాలో మేకింగే లేదు, సినిమా ఏం బాలేదు అనుకుంటూ థియేటర్ నుండి బయటకు వచ్చిందట. అప్పుడు జరిగిన ఈ విషయాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ రీజన్ తో సోషల్ మీడియా అంతా సుధా కొంగరని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. రామ్ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ అమీర్ సుల్తాన్ కోలీవుడ్లో 'పరుత్తివీరన్' లాంటి క్లాసిక్ మూవీని తీశాడు. ఇప్పుడు నటుడిగా మారిన అమీర్ ఫ్యాన్స్ సుధా కొంగర క్షమాపణ చెప్పాల్సిందే అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. 

దీంతో తాజాగా ఈ వివాదం పై రియాక్ట్ అయిన సుధా కొంగర.." నాకు అమీర్ అంటే ఎంతో రెస్పెక్ట్ ఉంది. నా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం పరుత్తివీరన్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ని ఎంత స్ట్రాంగ్ గా రాసాడో చూసి నేర్చుకున్నాను. అది నాకు తనపై ఉన్న గౌరవం" అంటూ తన ట్విట్టర్లో పేర్కొంది. దీంతో సుధాకర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం ఈ లేడీ డైరెక్టర్ మరోసారి కోలీవుడ్ స్టార్ సూర్యతో సినిమా చేస్తోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: