అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మహేష్ బాబు అభిమానులు తెగ బాధ పడుతున్నారు.ఎందుకంటే.. సందీప్ రెడ్డి వంగా, సూపర్ స్టార్ మహేష్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అది పక్కన పెట్టేసి సందీప్ యానిమల్ సినిమాని తెరకెక్కించారు. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగా, సూపర్ స్టార్ మహేష్ కి చెప్పింది యానిమల్ స్టోరీనే అని, అయితే మహేష్ గారు దానిని రిజెక్ట్ చేశాడని చెబుతున్నారు.దీంతో సూపర్ స్టార్ మహేష్ అభిమానులు.. ఇలాంటి సినిమాని ఎలా రిజెక్ట్ చేశావు అన్నా అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అయితే మహేష్ రిజెక్ట్ చేసింది అసలు ఈ కథేనా..? కదా..? అని ఒక సందేహం అందరిలో నెలకుంది.
తాజాగా హైదరాబాద్ లో యానిమల్ మూవీ టీం ప్రెస్ మీట్ ని నిర్వహించగా.. ఈ విషయం గురించి విలేకర్లు ప్రశ్నించారు. దీనికి సందీప్ రెడ్డి వంగా బదులిస్తూ.. “మహేష్ బాబు గారికి చెప్పింది వేరే కథ. ఆ మూవీ పేరు డెవిల్. అది కూడా కొంచెం యానిమల్ లాగానే ఉంటుంది.కానీ ఆ మూవీలోని హీరో పాత్ర యానిమల్ హీరో పాత్ర కంటే ఇంకా వైల్డ్ గా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు.ఇక ఆ సినిమాని మహేష్ బాబు రిజెక్ట్ చేయలేదట. కొన్ని కారణాలు వల్ల ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. కానీ ఫ్యూచర్ లో ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే అవకాశం ఎక్కువగా ఉందని కూడా వెల్లడించారు. ఇక ఒకవేళ యానిమల్ సినిమాని తెలుగు హీరోలతో చేయాలంటే.. ‘ఎవరితో చేస్తారు?’ అని ప్రశ్నించగా, సందీప్ రెడ్డి వంగా బదులిస్తూ.. “యానిమల్ మూవీని కూడా మహేష్ బాబు గారితోనే తెరకెక్కించేవాడిని” అంటూ చెప్పుకొచ్చారు. ఇక డెవిల్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.