గీతాంజలి సీక్వెల్ వచ్చేది అప్పుడే..?
ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటున్నారాట .ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ప్రారంభం కాబోతోందట. ఇందులో కూడా అంజలీని హీరోయిన్గా నటించబోతోందని తెలియజేశారు.. ప్రతికార జ్వాలతో మళ్లీ తిరిగి వచ్చిన గీతాంజలి ఈసారి ఏం చేస్తుంది ఎవరి మీద ప్రతికారం తీర్చుకుంటుంది అనే కదా అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. మొదటి భాగంలో విలన్ ఢీ కొట్టిన ఈమె ఇప్పుడు సరికొత్త విలన్ తో ఢీ కొట్టబోతున్నట్లు సమాచారం.
గీతాంజలి సినిమా మొత్తం హైదరాబాద్ ఊటీ నేపథ్యంలోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 80% వరకు సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. ఊటి లో త్వరలోనే షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయడానికి పలు రకాల సన్నహాలు చేస్తూనే ఉన్నారు.. అయితే జనవరి ఆఖరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సౌత్ లో అన్ని లాంగ్వేజ్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీంతో రెండో గీతాంజలిని అన్ని భాషలలో చూడవచ్చని చెప్పవచ్చు. మొదటి భాగంలో శ్రీనివాస్ రెడ్డి సత్యం రాజేష్ షకలక శంకర్ సప్తగిరి కామెడీతో బాగా ఆకట్టుకున్నారు.