చంటి అబ్బాయి వైపు అడుగులు వేస్తున్న అనీల్ రావిపూడి !
ప్రస్తుతం అనీల్ రావిపూడి చిరంజీవి వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారంమేరకు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ చిరంజీవి అనీల్ రావిపూడిల కాంబినేషన్ సెట్ చేయడానికి చాల గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఎప్పటి నుండో దిల్ రాజ్ కు చిరంజీవితో సినిమా చేయాలి అన్న కోరిక ఉండటంతో ఏదోవిధంగా ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేయాలని దిల్ రాజ్ ఆలోచన అని అంటున్నారు.
ఇప్పటికే దిల్ రాజ్ పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ తీసిన దిల్ రాజ్ రామ్ చరణ్ తో ‘గేమ్ ఛేంజర్’ మూవీని తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవితో కూడ అతడు సినిమాను తీయగలిగితే టాప్ మెగా హీరోలు అందరితోనూ సినిమాలు తీసిన క్రెడిట్ దిల్ రాజ్ సొంతం అవుతుంది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా అనీల్ రావిపూడి చిరంజీవితో తీయబోయే మూవీ ఒకప్పుడు జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘చంటబ్బాయి’ ఛాయలతో ఉంటుందని అంటున్నారు.
దాదాపు మూడు దశాబ్ధాల క్రితం మల్లాది కృష్ణమూర్తి వ్రాసిన ‘చంటబ్బాయి’ నవల ఆధారంగా జంధ్యాల చిరంజీవి ల కాంబినేషన్ లో వచ్చిన ఈమూవీ అప్పట్లో ఒక సంచలనం. ఇప్పుడు మళ్ళీ చిరంజీవిలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీయాలని అనీల్ రావిపూడి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఒక కామెడీ సబ్జెక్ట్ ను చిరంజీవి కోసం రెడీ పెడుతున్నట్లు టాక్. ‘భోళాశంకర్’ ఘోర పరాజయంతో రీమేక్ లపై మోజు తగ్గించుకున్న చిరంజీవి ఒరిజనల్ కథల కోసం అన్వేషణ సాగిస్తున్న పరిస్థితులలో అనీల్ రావిపూడి దిల్ రాజ్ లు చిరంజీవి కోసం చేస్తున్న ప్రయత్నాలు సక్సస్ అయ్యే ఆస్కారం కనిపిస్తోంది..