"హాయ్ నాన్న" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... వషిం అబ్దుల్ వాహేబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. 


ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం చాలా ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు ... అలాగే రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది.


ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ ని 155 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నాని ఆఖరుగా దసరా అని సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి  ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ ద్వారా నాని కి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. మరి దసరా తో మంచి గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్న నాని తదుపరి మూవీ కావడంతో హాయ్ నాన్న సినిమాపై కూడా ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే రేంజ్ అంచనాలు నెలకొని ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: