ఎట్టకేలకు తన భర్తను పరిచయం చేసిన ఇలియానా..?

Divya
పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా గతంలో హీరోయిన్గా ఎంతటి పాపులారిటీ అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. బాలీవుడ్లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన కెరీర్ని నాశనం చేసుకున్న ఇలియానా చివరిగా అడపా దడపా సినిమాలలో నటిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇలియానా ఇండియాలో పుట్టి పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు తల్లి కావడంతో పలువురు అభిమానులు సైతం ఈమె పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు గత కొద్దిరోజుల నుంచి ఈమె కేవలం బిడ్డ ఫోటోలు మాత్రమే షేర్ చేస్తూ సంబరపడిపోతోంది.

తన భర్త గురించి ఎలాంటి విషయాలు పంచుకోలేదు. ఇంతకాలం మౌనంగా ఉన్న ఇలియానా ఇప్పుడు ఓపెన్ అవ్వక తప్పడం లేదు.. సోషల్ మీడియాలో అభిమానులతో ఇంట్రాక్ట్ అయినప్పుడు ఈ ముద్దుగుమ్మ తన భర్త ఎవరనే విషయం పైన తెలియజేసింది.. గతంలో డేట్ నైట్ అంటూ ఒక వ్యక్తితో ఫోటోలను షేర్ చేయడం జరిగింది కానీ అతనే నా భర్త అని మాత్రం చెప్పలేదు ఇలియానా.. దీంతో అతను ఎవరు ఇలియానా పక్కన ఎందుకు క్లోజ్ గా ఉన్నారు అనే విషయాలపై పలు రకాలుగా సందేహాలు మొదలయ్యాయి. అయితే వాటిని నా భర్త అంటూ ప్రకటించడం జరిగింది ఇలియానా..


మీ సింగల్ పేరేంటింగ్ లైఫ్ ఎలా ఉంది అని అడగక అందుకు నేను సింగిల్ కాదు నా కుమారుడు తండ్రి ఇతడే అని చెప్పింది.. అతని వివరాలను మాత్రం చాలా రహస్యంగా ఉంచింది ఇలియానా.. అయితే అతనికి సంబంధించి ఎలాంటి విషయాలను చెప్పకుండా కన్ఫ్యూజన్లో పడేసింది. ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ బిడ్డకు తండ్రి అతనే అని చెప్పి విమర్శకుల నుంచి తప్పించుకోగలిగింది..మరి త్వరలోనే ఇలియానా మళ్ళీ సినిమాలతో బిజీగా అవుతుందేమో చూడాలి మరి ప్రస్తుతం అమ్మ ప్రేమకు దగ్గరైన ఇలియానా తన కుమారుడికి నాన్న కుటుంబ జీవితాన్ని ఆస్వాదించేలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: