హీరోలను టెన్షన్ పెడుతున్న ఓటీటీ లు !

Seetha Sailaja
టాలీవుడ్‌ ఇండస్ట్రిని నిరంతరం ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉండటంతో నిర్మాతలు నిరంతరం కలవరపాటుకు గురి అవుతూనే  ఉన్నారు. దేశాన్ని ఒక కుదుపు కుడిపిన కరోనా సమయంలో ఊపందుకున్న డిజిటల్ మార్కెట్ ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రేక్షకులకు డిజిటల్ కంటెంట్ ను అలవాటు చేయడానికి ఆరంభంలో భారీగా ఖర్చుపెట్టిన అనేక ప్రముఖ ఓటీటీ సంస్థలు ఇప్పుడు తమ వ్యాపార ప్రాణాళికలను మార్చుకున్నాయి.  

వందల కోట్లలో తాము పెట్టిన పెట్టుబడికి సరైన రికవరీ లేకపోవడంతో  పాటు సబ్‌స్క్రిప్షన్లు ఒక స్థాయిని మించకపోవడంతో అన్ని ఓటీటీ  సంస్థలు కాస్ట్ కటింగ్ మీద దృష్టిపెట్టాయి. ఇప్పుడు మారిన వ్యూహాలలో  భాగంగా ఓటీటీ సంస్థలు అన్ని సినిమాలనుకొనడంలేదు.సెలెక్టివ్‌ గా సినిమాలను కొంటున్నాయి. దీనికితోడు సినిమాల రేట్ విషయంలో  మోజుపడి రేటు పెట్టడంలేదు.    

దీనితో భారీ సినిమాలకు కూడ డిజిటల్ డీల్స్ అనుకున్నంత వేగంగా  జరగడంలేదు అని అంటున్నారు. కొన్ని ఫెయిల్ అయిన భారీ సినిమాల డిజిటల్ రైట్స్ అమ్ముడు పోని పరిస్థితిలో ఉన్నాయి అని వార్తలు  వస్తున్నాయి. కరోనా పరిస్థితుల తరువాత పెరిగిన డిజిటల్ మార్కెట్ ను  చూసుకుని టాప్ హీరోలు మీడియం రేంజ్ హీరోలు తమ పారితోషకాలను విపరీతంగా పెంచారు. ఇప్పుడు ఆ పారితోషికాల స్థాయిలో సినిమాల బిజినెస్ జరగక పోవడంతో చాలామంది నిర్మాతలు తెగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనితో పడిపోతున్న డిజిటల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకోవాలని నిర్మాతలు హీరోల పై ఒత్తిడి చేయాలని ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. అదే జరిగితే జరుగుతున్న పరిణామాలు హీరోలకు టెన్షన్ ను కలిగించడం ఖాయం. అయితే టాప్ హీరోలు డేట్స్ ఇస్తే చాలు ఎన్ని కోట్ల పారితోషికం అయినా ఇవ్వడానికి క్యూ కడుతున్న నిర్మాతలు అనేకమంది ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులలో నిర్మాతలు చేయబోయే రాయబారాలు ఎంతవరకు విజయవంతం అవుతాయి అన్న అభిప్రాయాలు ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలు వ్యక్త పరుస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: