ఓటీటి లో నిరాశ పరుస్తున్న లియో మూవీ...!!

Divya
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన దళపతి విజయ్.. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన యూనివర్సిటీ చిత్రం లియో.. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కావడం జరిగింది. హీరోయిన్గా త్రిష నటించిన కీలకమైన పాత్రలో అర్జున్ సర్జా, విలన్ గా సంజయ్ దత్ నటించడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్ల సైతం కురిపించింది తమిళనాడులోని కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా కలెక్షన్స్ పరంగా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సమాచారం.


థియేటర్ల మిస్ అయిన వారికోసం లియో సినిమా ఇప్పుడు ఓటీటి నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. అయితే ఇంగ్లీష్ తెలుగు కన్నడ తమిళ్ మలయాళం వంటి భాషలలో కూడా స్ట్రిమింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది. అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సినిమాని చూస్తున్న తరుణంలో అభిమానులను నిరాశ పరుస్తోందని తెలుస్తోంది. అందుకు కారణం ఏమిటంటే ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు సెన్సార్ చేయపడ్డాయని.. అలా మంచి మంచి సన్నివేశాలు కూడా సెన్సార్ కట్ చేయడంతో అభిమానుల సైతం తీవ్ర నిరాశకు గురవుతున్నారట.


లియో సినిమాలో త్రిష తో పాటు ప్రియా ఆనంద్, మలయాల నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ మీనన్ తదితరులు సైతం నటించడం జరిగింది.. ఇక విజయ్ తదుపరి సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన 68వ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తోంది.. అలాగే సీనియర్ హీరో ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు, జయరామ్ తదితరుల సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటింబబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: