షాకింగ్ న్యూస్ లో అనిమల్ విలన్ !
ఇది ఇలా ఉండగా ఈమూవీకి సంబంధించిన మరొక షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈమూవీలో విలన్ పాత్రలో నటిస్తున్న బాబీ డియోల్ కు ఒక్క డైలాగు ఉండదట. మౌనంగా ఉంటూనే ఒళ్ళు జలదరించే పనులు చేయడం అతడి స్టైల్ అని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఒక క్రూరమైన విలన్ మూగవాడుగా నటించిన సందర్భాలు లేవు.
ఈమూవీలో విలన్ పాత్రను ఎలివేట్ చేసే ఎటువంటి డైలాగ్స్ ఉండవనీ కేవలం బాబీ డియోల్ బాడీ లాంగ్వేజ్ లోనే భయంకరమైన విలన్ ను ప్రేక్షకులు చూసేవిధంగా సందీప్ వంగా ఈపాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీలో ప్రత్యేకంగా విలన్స్ కనిపించరు. పరిస్థితులే విలన్స్ గా మారుస్తాయి. ఇప్పుడు అదే సక్సస్ మంత్రాన్ని సందీప్ వంగా ‘అనిమల్’ విషయంలో కూడ అనుసరిస్తున్నట్లు అనిపిస్తోంది.
వాస్తవానికి ఈసినిమాని నిర్మిస్తున్న టీ సిరీస్ సంస్థ ఈమూవీ పట్ల ఉన్న మితిమీరిన నమ్మకంతో ఈమూవీని పెద్దగా ప్రమోట్ చేయడంలేదు. కేవలం మౌత్ పాజిటివ్ టాక్ ద్వారా ఈమూవీ కలక్షన్స్ సునామీ సృష్టిస్తుందని అంచనాలతో ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఈమూవీ నిడివి 3 గంటల 30 నిముషాలు అని వస్తున్న వార్తల పై సందీప్ వంగా నుండి ఎటువంటి క్లారిటీ లేకపోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఈమూవీ తెలుగులో కూడ డబ్ చేసి విడుదల చేస్తున్న పరిస్థితులలో ఈమూవీకి పోటీగా మరే తెలుగు సినిమా విడుదల అవ్వకపోవడం బట్టి ఈమూవీ మ్యానియా ఏస్థాయిలో ఉందో అర్థం అవుతుంది..