సినిమా రివ్యూలపై సాయి రాజేష్ ప్రశ్నల పరంపర !

Seetha Sailaja
ఒక సినిమా తీయడానికి కనీసం ఒక ఏడాది సమయం పడుతుంది. ఈ సంవత్సర కాలంలో ఆసినిమాకు దర్శకత్వం వహించే దర్శకుడు అదేవిధంగా ఆసినిమాను నిర్మించే నిర్మాత ఎన్నో ఆటుపొట్లను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇంత కష్టపడి తీసిన ఆసినిమా రిలీజ్ అయిన తరువాత ఆసినిమాల విషయంలో ఎవరి ఒపీనియన్ వారికి ఉంటుంది. ఈమధ్యకాలంలో సినిమా రివ్యూలపైన చిత్ర దర్శక నిర్మాతలు అలాగే యాక్టర్స్ కూడ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.




కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టి తీస్తే సినిమా కష్టం తెలియకుండా రివ్యూలు రాసేసి పబ్లిక్ చూడాలా చూడకూడదా అనేది డిసైడ్ చేస్తున్నారు అంటూ గగ్గోలు పెడుతున్నారు. లేటెస్ట్ గా కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు సినిమాల రివ్యూ రైటర్స్ ను అదేవిధంగా ఫిలిమ్ క్రిటిక్స్ ను ఆహ్వానించి నిర్వహించిన చర్చా గోష్టులో దర్శకుడు సాయి రాజేష్ ఫిలిమ్ క్రిటిక్స్ ను టార్గెట్ చేస్తూ కొన్ని ప్రశ్నలు వేశాడు.

 



గొప్ప సినిమా అంటే ఏంటి ఏపాయింట్స్ ను ఆధారంగా చేసుకుని రేటింగ్స్ ఇస్తున్నారు అంటూ  ప్రశ్నల పరంపర కొనసాగించాడు. ఈచర్చ కొనసాగుతున్న పరిస్థితులలో ఒక ఫిలిమ్ జర్నలిస్ట్ కలగచేసుకుని అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఒక సినిమాను ఫస్ట్ డే మొదటి షో చూసిన జర్నలిస్ట్ తన మనసులో ఏదైతే ఫీల్ అవుతాడో దానిని రాస్తాడని రివ్యూలు ఏవీ అందరూ డిసైడ్ చేసుకొని రాసినవి కాదని అంటూ క్లారిటీ ఇచ్చాడు.




అయితే చాలా వెబ్ సైట్స్ రివ్యూలు రాసేడప్పుడు 2.75 నుంచి 3.25 మధ్యనే ఎక్కువగా రేటింగ్స్ ఇస్తూనాయని అంటూ చాలా మంది ఫిలిమ్ క్రిటిక్స్ రివ్యూ లు రాసే  విషయంలో సేఫ్ గేమ్  ఆడుతున్నారు  అంటూ  సాయి రాజేష్ చేసిన కామెంట్స్ కు అనేక  విమర్శలు ప్రతి విమర్శలు  వచ్చాయి. ఏదిఏమైనా వందల కోట్ల పెట్టుబడితో తీసిన సినిమాలకు ఏదో ఒక తూకం వేసినట్లు  రేటింగ్స్ ఇవ్వడం చాలమంది అంగీకరించ లేకపోతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: