టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. తాజా గా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ ఇవాళ కర్ణాటక లోని మైసూరు లో షురూ అయింది. 12 రోజులపాటు ఈ షెడ్యూల్ కొనసాగ నున్నట్టు సమాచారం.గేమ్ ఛేంజర్ లో కథానుగుణంగా రాంచరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తుండగా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. శంకర్ అద్భుతమైన విజువల్స్, రాంచరణ్ పర్ఫార్మెన్స్ వచ్చే ఏడాది థియేటర్ల లో బ్లాస్టింగ్‌గా ఉండబోతుందట. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో వస్తోన్న ఈ చిత్రం లో రాజోలు భామ అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తుండగా.. గేమ్ ఛేంజర్ కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.గేమ్ ఛేంజర్ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ Saregama దక్కించుకుంది. రాంచరణ్ మరో వైపు బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో ఆర్సీ 16కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ లో సాయి పల్లవిని తీసుకున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.