మెగా 156 మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీమ్..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో వారి విజయాన్ని అందుకున్న ఆయన దానికంటే ముందు చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా ఫ్లాప్స్ గా నిలిచాయి. చివరిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా సైతం ఫ్లాప్ అవడంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ పడ్డారు. దాంతో మెగాస్టార్ ఇప్పుడు లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ గా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన నెక్స్ట్ సినిమాపై సైతం క్లారిటీ ఇవ్వడం జరిగింది. బింబిసారా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న


యంగ్ డైరెక్టర్ విశిష్టత మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్లో మెగా 156  సినిమాగా ఇది రాబోతోంది. కాగా UV క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఉవ్ వారు మొదటిసారిగా చిరంజీవితో కలిసి ఈ సినిమాని తీస్తున్నారు. ఇక కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాని అనౌన్స్ చేయగా పూజా కార్యక్రమాలను సైతం పూర్తి చేశారు. కానీ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు. దానికి ఇంకా సమయం పడుతుందని అన్నారు. ఈ సినిమా కన్నా ముందు చిరంజీవి.. బంగార్రాజు ఫేమ్.. కళ్యాణ్ కృష్ణతో ఒక సినిమా చేయాలి. మెగా 156 గా ఆమూవీనే రావాల్సి ఉంది.


వశిష్టతో చేయాల్సింది మెగా 157 మూవీగా రావాల్సి ఉంది. కాని ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోవడంతో.. ఈ సినిమానే మెగా 156గా మారింది. ఇక ఈ సినిమాకు విశ్వంభర టైటిల్ దాదాపు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈసినిమాలో చిరంజీవి ముల్లోక వీరుడుగా కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది.  అయితే కారణాల వల్ల ఈసనిమా సెట్స్ మీదకు వెళ్లడానికి లేట్ అయ్యింది. వరుసగా షూట్ వాయిదా పడుతూ వచ్చింది.తాజాగా ఈమూవీ ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. క్లాప్ బోర్డు ను షేర్ చేస్తూ.. మెగా 156 సెట్ లో కి వచ్చేసింది అని చెప్పుకొచ్చారు. దాంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కానీ ఇందులో హీరోయిన్ ఎవరు అన్న విషయాన్ని మాత్రం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. త్వరలోనే ఈ విషయంపై కూడా క్లారిటీ రానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: