"తలపతి 68" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ఆఖరుగా లియో అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే లియో లాంటి బ్లాక్ బాస్టర్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న విజయ్ ప్రస్తుతం తమిళ శని పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ని ఫిక్స్ చేయలేదు.


దానితో ఈ మూవీ విజయ్ కెరియర్ లో 68 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా యొక్క షూటింగ్ ను తలపతి 68 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు సినిమా యొక్క షూటింగ్ లో చెన్నై లో వేసిన ఒక భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమాకు సంబంధించిన చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత షెడ్యూల్ లో విజయ్ కూడా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.


మరో ఐదు రోజుల పాటు ఈ మూవీ బృందం చెన్నై లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమా షూటింగ్ ను జరపనున్నట్లు సమాచారం. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో తమిళ సినిమా ఇండస్ట్రీ.లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ మంచి విజయం సాధించినట్లయితే ఈ నటికి కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ లభించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: