ఏంటీ.. జాతకం ప్రకారం.. బన్నీ కొడుక్కి సినిమా యోగ్యం లేదా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలకు సంబంధించిన వారసులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని బాషలలో కూడా ఇలా స్టార్ కిడ్లుగా ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయమైన వారే హవా నడిపిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి పిల్లలు చైల్డ్ ఆర్టిస్టులుగా కూడా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఇలా తమ అభిమాన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇస్తారు ఫ్యాన్స్ అందరూ కూడా భారీగానే ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ అది జరగదు అని తెలిస్తే ఎంతలా నిరాశ చెందుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షాజ్ఞ ఎంట్రీ విషయంలో కూడా అభిమానులు ఇలాంటి కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా అల్లు వారసుడు  అయాన్ జాతకం గురించి తెలిసి ఇక అభిమానులు అందరూ కూడా మరింతగా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అల్లు అర్జున్ వారసుడిగా కుమారుడు అయాన్ కూడా ఇండస్ట్రీ లోకి వస్తాడని.. అభిమానులు ఊహించడం సర్వసాధారణం.


 అయితే బన్నీ కూతురు అర్హ ఇప్పటికి ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే అయాన్ చదువు పూర్తి చేసిన తర్వాత నేరుగా హీరో గానే ఎంట్రీ ఇస్తాడని అందరూ ఊహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ వార్త వైరల్ గా మారిపోయింది. అయాన్ జాతకం ప్రకారం ఈయనకు సినిమాలు పెద్దగా కలిసి రావట. కాదు కూడదు అని సినిమాల్లోకి వచ్చిన పెద్దగా సక్సెస్ అయ్యే అవకాశాలు మాత్రం ఏమాత్రం లేవు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. అయితే సినిమాల కంటే రాజకీయరంగంలో అయాన్ మంచి సక్సెస్ అందుకుంటాడట. ఈ విషయం తెలిసి అల్లు ఫాన్స్ అందరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: