శ్రీలీల మ్యానియా పై ఆధారపడ్డ వైష్ణవ్ తేజ్ !
యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి తీసిన ఈమూవీ యూత్ కు బాగా నచ్చుతుందని వైష్ణవ్ తేజ్ చాల గట్టినమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సంవత్సరం ఒక్క సాయి ధరమ్ తేజ్ కు మినహా మినహా మిగతా మెగా హీరోలు ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ ల సినిమాలకు ఏమాత్రం కలిసిరాలేదు. ఈ నెగిటివ్ సెంటిమెంట్ కు వైష్ణవ్ తేజ్ శ్రీలీల మ్యానియాతో చెక్ పెట్టగలడా అన్న సందేహాలు చాల మందిలో ఉన్నాయి.
సినిమా కథలో కొత్తదనం కనిపించకపోతే సగటు ప్రేక్షకుడు వెంటనే ఆసినిమా పై పెదవి విరుస్తున్నాడు. ‘ఉప్పెన’ తరువాత వైష్ణవ్ తేజ్ ఎన్నిప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ కు అదేవిధంగా పాటలకు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై వైష్ణవ్ తేజ్ ఆశలు పెట్టుకున్నప్పటికే ఈమూవీ ప్రీ రిలీజ్ క్రేజ్ అంతంత మాత్రంగానే ఉంది.
శ్రీలీల ‘భగవంత్ కేసరి’ మూవీలో అదేవిధంగా రామ్ నటించన ‘స్కంద’ మూవీలో కనిపించినప్పటికీ ఆమె క్రేజ్ ఆసినిమాల సక్సస్ కు ఏమాత్రం సహాయపడలేదు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. అయితే క్రికెట్ వరల్డ్ కప్ హడావిడి పూర్తి అవ్వడంతో ఇక జనం ముఖ్యంగా యూత్ ధియేటర్ల బాట పడతారని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ అంచనాలు వైష్ణవ్ తేజ్ శ్రీలీల విషయంలో ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తాయో చూడాలి..
ReplyForward |