చరణ్ సినిమాకు.. సాయి పల్లవి ఓకే చెప్పేసిందిట తెలుసా?
అయితే ఈ సినిమా అటు షూటింగ్ జరుగుతూ ఉండగానే.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తో ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు రామ్ చరణ్. ఈ క్రమంలోనే ఎలాంటి లీకులు లేకుండానే ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది అని చెప్పాలి. అయితే అప్పుడెప్పుడో మొదలుపెట్టిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సాంకేతిక నిపుణులు నటీనటుల ఎంపిక కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు అని మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు అన్నది తెలుస్తుంది. అయితే సహజనటినే కథనాయకగా ఎంచుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
అయితే తెలుగు ప్రేక్షకులకు సహజనటి అని పేరు వినిపించగానే గుర్తుచ్చేది జయసుధ. కానీ ఇప్పటి ప్రేక్షకులకు ఇక సహజ నటి అనగానే సాయి పల్లవి గుర్తుకు వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్ల పేరును పరిశీలించినప్పటికీ చివరికి సాయి పల్లవినే ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. కథలో హీరోయిన్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని.. అందుకే ఇక స్టోరీ నచ్చడంతో సాయి పల్లవి కూడా ఈ సినిమాకు ఓకే చెప్పేసింది అంటూ ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ఈ నేచురల్ బ్యూటీ ముంబైలో రణబీర్ కపూర్ తో ఒక మూవీకి రెడీ అవుతుంది అని టాక్ ఉంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కే లోపు చరణ్ సినిమా చేయాలని ఆలోచనలో ఉందట సాయి పల్లవి.