విశ్వంభర పై షాకింగ్ న్యూస్ !

Seetha Sailaja
‘భోళాశంకర్’ ఘోర పరాజయంతో ఎలర్ట్ అయిన చిరంజీవి తన భవిష్యత్ సినిమాల కథల ఎంపిక విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వాస్తవానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమాను మొదలుపెట్టవలసి ఉన్నప్పటికీ ఆమూవీని పక్కకు పెట్టి ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట తో ఒక భారీ బడ్జెట్ సినిమాను మొదలుపెట్టడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.



గతంలో చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ స్థాయిని మించి ఈ మూవీని బ్లాక్ బష్టర్ హిట్ చేయాలి అన్నపట్టుదలతో వశిష్ట ఉన్నాడు. డిసెంబర్ నుండి షూటింగ్ మొదలుపెట్టబోతున్న ఈసినిమా గురించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీ దర్శకుడు కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ఈ మూవీ గ్రాఫిక్స్ కోసమే తాము 200 కోట్లు ఖర్చుపెడుతున్న విషయాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.



కేవలం గ్రాఫిక్స్ కోసమే ఈమూవీ విషయంలో 200 కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి ఈమూవీ పూర్తి అయ్యేసరికీ మూవీ బడ్జెట్ 500 కోట్ల స్థాయికి చేరినా ఆశ్చర్యంలేదు అని అంటున్నారు. ఇంత భారీ బడ్జెట్ చిరంజీవి సినిమా పై ఖర్చుపెట్టాలి అంటే ఈమూవీకి కనీసం 1000 కోట్ల కలక్షన్స్ వచ్చితీరాలి అన్న అంచనాలు వస్తున్నాయి.



తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి ఇమేజ్ కి ఎదురులేకపోయినా పాన్ ఇండియా స్థాయిలో చిరంజీవి ఇమేజ్ అంతంత మాత్రం అవ్వడంతో ‘విశ్వంభర’ పై ఈ రేంజ్ లో ఖర్చుపెట్టి ఈమూవీ నిర్మాతలు సాహసం చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీలోని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మూవీని చిరంజీవి కెరియర్ లో మెమరబుల్ మూవీగా తీర్చిదిద్దాలని వశిష్ట చేస్తున్న  ప్రయత్నాలు ఎంతవరకు విజయవంతం  అవుతాయో చూడాలి. అయితే  గతంలో చిరంజీవితో భారీ గ్రాఫిక్స్ తో  కోడి రామకృష్ణ తీసిన ‘అంజి’ ఫ్లాప్ గా మారిన నేపధ్యంలో వశిష్ట మెగా స్టార్ చిరంజీవితో గత అనుభవాలను లెక్క చేయకుండా ఒక భారీ  ప్రయోగానికి శ్రీకారం చూట్టాడు అనుకోవాలి..  









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: