విజయ్ దేవరకొండ మార్కెట్ డౌన్.. చేజేతులారా చేసుకుంటున్నాడా?

praveen
ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి చిన్నచితక పాత్రలు చేస్తూ హీరోగా అవతారం ఎత్తాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక అప్పటినుంచి విజయ్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గీత గోవిందం సినిమా 100 కోట్ల క్లబ్లో చేరడంతో ఒకసారిగా స్టార్ హీరో రేస్ లోకి వచ్చేసాడు. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం విజయ్ దేవరకొండకు సరైన హిట్టు దక్కడం లేదు  లైగర్ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.


 అయితే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఖుషి సినిమాతో అయినా విజయ్ ఖాతాలో ఒక హిట్టు చేరుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా మాత్రం నిరాశపరిచింది. ఇక ఇప్పుడు గీత గోవిందం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశురాంతో మరో సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. అయితే గీతాగోవిందం లాంటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది అన్న నమ్మకాలు మాత్రం ప్రేక్షకుల్లో పెద్దగా లేవు.


 ఇక సర్కారు వారి పాట సినిమాతో పరశురాం పై ఉన్న అంచనాలు మరింత తగ్గిపోయాయి. అయితే ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికి వచ్చి పండుగ సెలవులు కలిసి వచ్చి సూపర్ హిట్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు సంక్రాంతి నుంచి ఈ సినిమా తప్పుకుంది. ఇక మార్చి నెలలో విడుదలవుతుందని ప్రచారం ఉన్న.. ఆ నెలలోనే చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి. అయితే ఈ మూవీ తర్వాత గౌతమ్ తిన్న నూరితో విజయ్ సినిమా చేయబోతున్నాడు. అయితే మధ్యలో గౌతమ్ ఒక చిన్న సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నాడు  తర్వాతే విజయ్ సినిమా ఉంటుందట. దీనిబట్టి చూస్తే విజయ్ చేస్తున్న సినిమాలన్నీ చిన్న డైరెక్టర్లతోనే. దీంతో ఇక విజయ మార్కెటు ఎలా పెరుగుతుంది అనే సందేహాలు వస్తున్నాయి  అందరూ పాన్ ఇండియా అంటూ పరుగులు పెడుతుంటే విజయ్ మాత్రం చిన్న డైరెక్టర్లతో సినిమాలు ఎందుకు చేస్తున్నాడు అంటూ అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: