పెద్ది ఓటీటి డీల్ తో స్టామినా నిరూపించిన రామ్ చరణ్..!
ప్రస్తుతం రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ పెరిగిపోవడంతో పాటుగా పెద్ది సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడేలా ఇప్పటివరకు విడుదలైన అప్డేట్ అన్ని కూడా హైలెట్గా నిలిచాయి. ఇప్పుడు డిజిటల్ రైట్స్ ద్వారానే ఇంతటి భారీ మొత్తం రావడంతో సినీ ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ఒప్పందంలో మరో విషయం ఏమిటంటే ఈ సినిమా సాధించే విజయాన్ని బట్టి నెట్ ఫ్లిక్ అదనంగా మరో రూ .20 కోట్ల రూపాయల వరకు బోనస్ ఇచ్చే అవకాశం ఉన్నదట. ఒకవేళ పెద్ది సినిమా థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే రూ. 150 కోట్ల రూపాయల వరకు డీల్ పెరిగే అవకాశం ఉంటుంది.
మొదటిసారి రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో రామ్ చరణ్ పహిల్వాన్గా, క్రికెటర్ గా రెండు విభిన్నమైన షేర్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. పెద్ది సినిమా విడుదలైన తర్వాత నాలుగు వారాలకు ఓటీటిలోకి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఓటీటి దీంతో కూడా సోషల్ మీడియాలో మరొకసారి హాట్ టాపిక్ గా మారుతుంది పెద్ది చిత్రం.