హీరోల రేంజ్ లో.. రేటు పెంచిన త్రిష.. వామ్మో అన్ని కోట్లా?
అయితే కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు సైతం ఇలా ఎక్కువ కాలం కెరీయర్ని కొనసాగించవచ్చు అని నేటి రోజుల్లో కొంతమంది నిరూపిస్తున్నారు. ఒక దశాబ్ద కాలం స్టార్ హీరోయిన్గా కొనసాగడమే ఎక్కువ అనుకునే ఈ రోజుల్లో రెండు దశాబ్దాల కాలం దగ్గర పడుతున్న ఇంకా క్రేజ్ తగ్గని హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో త్రిష కూడా ఒకరు. సౌత్ లో రెండు దశాబ్దాలుగా టాప్ హీరోయిన్గా హవా నడిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది.
ఏకంగా పోనియన్ సెల్వన్ సినిమాలతో హిట్టు కొట్టిన త్రిష.. మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సొగసరి చేతిలో కమల్ - మణిరత్నం సినిమాతో పాటు అజిత్ మూవీ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ క్యాష్ చేసుకోవాలని చూస్తుందట త్రిష. ఈ క్రమంలోనే గట్టిగా రెమ్యూనరేషన్ పెంచేసిందట. మొన్నటి వరకు రెండు మూడు కోట్లు తీసుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు ఒక్క సినిమాకి 10 కోట్లు డిమాండ్ చేస్తుందట. అయితే ఇక ఇంత భారీ పారితోషికం డిమాండ్ చేయడంతోనే అటు చిరంజీవి, బాలయ్య సినిమాలు కూడా మిస్ అయ్యాయి అంటూ ఒక టాక్ వినిపిస్తుంది.