వెంకీ అట్లూరి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాశి ఖన్నా కాంబినేషన్లో వచ్చిన తొలిప్రేమ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. 2018 ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొదటి షో తోనే భారీ సక్సెస్ను సొంతం చేసుకుంది. దీంతో ఫిదా సినిమా తర్వాత వరుణ్ తేజ్ కి మరొక పడింది. కథ పరంగా చెప్పుకోవాలి అంటే తొలిప్రేమ సినిమా కొత్తగా ఏమీ లేదు. కానీ స్క్రీన్ చాలా బాగుంటుంది.
వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ సంభాషణలు వంటివి ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటనకి చాలా మంచి మార్కులు పడ్డాయి. దాంతోపాటు హీరోయిన్ రాశి ఖన్నా కి సైతం ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా కంటే ముందు రాశి కన్నా కెరియర్ కాస్త అటు ఇటుగా ఉంది అని చెప్పాలి. కానీ ఈ సినిమా తరువాత తనకి దాదాపుగా అరడజనుకు పైగానే సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. అలా ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది రాశిఖన్నా. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
అదేంటంటే తొలిప్రేమ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ రాజశేఖర్ అన్న కాదట. మరో స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేస్తే.. ఆ అవకాశం రాశీకి దక్కిందట. అవును ‘తొలిప్రేమ’ చిత్రాన్ని మిస్ చేసుకున్న హీరోయిన్ మరెవరో కాదు మెహరీన్ కౌర్ పిర్జాదా. అవును.. ముందుగా వర్ష పాత్ర కోసం మెహరీన్ ను అడిగారట. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ తర్వాత మెహరీన్ ఇమేజ్ పెరిగింది. ఆ తర్వాత వరుసగా ఆమె 6 ప్రాజెక్టులకు సైన్ చేసిందట. అదే టైంలో ‘తొలిప్రేమ’ ఆఫర్ కూడా వచ్చిందట. కానీ అప్పటికే తన చేతిలో ఆరు ప్రాజెక్టులో ఉండడంతో తను చాలా బిజీగా ఉంది. ఇక అదే సమయంలో తొలిప్రేమ సినిమా అవకాశం రావడంతో చేసేదేమీ లేక ఈ సినిమాని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది మెహరీన్..!!