నాగార్జున పంతం నెరవేరుతుందా ?
ఈయంగ్ హీరోలు ఇద్దరికీ హిట్ వచ్చి సంవత్సరాలు గడచిపోతున్నాయి. ఈ పరిస్థితులలో ఒక సాలిడ్ హిట్ లేకపోతే రేస్ లో నిలబడటం అంత సాధ్యంకాదు అన్న వాస్తవాన్ని గ్రహించిన నాగ్ ప్రస్తుతం ‘నాసామిరంగా’ అనే ఒక మాస్ సినిమాలో నాటిస్తున్నాడు. ఒక మళయాళ సినిమాకు రీమేక్ గా నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ మొదటివారానికి పూర్తి అవుతుంది అని అంటున్నారు.
ఇప్పటికే సంక్రాంతికి విడుదల అంటూ ఈ మూవీ యూనిట్ నుండి లీకులు వస్తున్న పరిస్తులలో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి విడుదల వాయిదా పడవచ్చు అని వస్తున్న వార్తలు నాగార్జునలో మరింత జోష్ ను పెంచాయి అని అంటున్నారు. ఎన్ని సినిమాలు పోటీ ఉన్నప్పటికీ సంక్రాంతి సినిమాల సెంటిమెంట్ తనకు కలిసి వస్తుందని గట్టి నమ్మకం పై ఉన్నట్లు తెలుస్తోంది.
మహేష్ ‘గుంటూరు కారం’ రవితేజా ‘ఈగల్’ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తేజ్ సజ్జా ‘హనుమాన్’ సినిమాల నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ తన సినిమాకు తన సెంటిమెంట్ రీత్యా ఏమాత్రం సమస్య ఉండదు అని నాగార్జున భావిశుననట్లు తెలుస్తోంది. అయితే ఇన్ని సంక్రాంతి భారీ సినిమాల మధ్య ఫ్లాప్ లలో ఉన్న నాగార్జున సంక్రాంతి విషయంలో ఎందుకు ఇంత పంతంగా ఉన్నాడు అన్న విషయం పై క్లారిటీ లేక ఇండస్ట్రీ వర్గాలు కన్ఫ్యూజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతి సినిమాలలో ‘హనుమాన్’ కూడ రేస్ లో ఉండటంతో నాగార్జున ఎందుకు ఇంత సాహసం చేస్తున్నాడు అంటూ కొందరి అభిప్రాయం..