అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజ్ పై షాకింగ్ న్యూస్ !

Seetha Sailaja
‘పుష్ప’ మూవీతో అప్పటివరకు స్టైలిస్ట్ స్టార్ గా బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చుకున్న అల్లు అర్జున్ ఆమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఒక్కసారిగా ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘పుష్ప 2’ మూవీ విడుదల తరువాత అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ ఎవరు ఊహించని విధంగా తారా స్థాయికి చేరుకుంటుందని అంచనాలు వస్తున్నాయి.



ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇమేజ్ కలిగిన బన్నీ క్రేజ్ ను తమ ప్రొడక్ట్స్ కు వాడుకోవాలని అనేక మల్టీ నేషనల్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. బన్నీ తన ప్రొడక్ట్ ను ప్రమోట్ చేస్తే తమ ప్రొడక్ట్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగి తమ ప్రొడక్ట్ సేల్స్ మరింత పేరుగుతాయని అనేక మల్టీ నేషనల్ కంపెనీలు భావిస్తూ ఉండటంతో బన్నీని తమ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని రాయబారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.



తమ ప్రొడక్ట్స్ కు సంబంధించి ప్రమోట్ చేసే యాడ్ షూటింగ్స్ లో పాల్గొనడానికి బన్నీ రోజుకి 6 కోట్లు పారితోషికంగా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రేంజ్ లో పారితోషికం బాలీవుడ్ టాప్ హీరోలు డిమాండ్ చేస్తూ ఉంటారని అలాంటి రేంజ్ లో ఇప్పుడు బన్నీ చేరుకోవడం షాకింగ్ న్యూస్ గా మారిందని మీడియా వర్గాలు అంటున్నాయి. బన్నీ మ్యానియా కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఉత్తరాది ప్రాంతంలో కూడ ముఖ్యంగా అక్కడ యూత్ లో పెరుగుతూ ఉండటం ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది.



ఇది ఇలా ఉండగా ‘పుష్ప 2’ మూవీలో కూడ అదిరిపోయే ఒక ఐటమ్ సాంగ్ ను సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్ లో నటించడానికి అనేకమంది బాలీవుడ్ బ్యూటీలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ సుకుమార్ ఆలోచనలు మాత్రం సమంత వైపే ఉన్నట్లు టాక్. ఏదోవిధంగా సమంతను ఒప్పించి ‘పుష్ప 2’ లో కూడ ఆమె చేత ఒక ఐటమ్ సాంగ్ ను చేయించడమే కాకుండా ఆమెకు సంబంధించి ఒక కీలక పాత్రను కూడ క్రియేట్ చేస్తున్నట్లు టాక్..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: