కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'లియో'. దసరా కానుకగా అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ సినిమాలో విజయ్ నటన, అనిరుద్ బిజిఎం, యాక్షన్ సీక్వెన్స్ లు ఆకట్టుకోవడంతో సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా 'లియో' మూవీ ఓటీటీలోకి రాబోతుందనే న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ 'లియో' ఓటీటీ రైట్స్ ని దక్కించుకుంది. థియేటర్లో విడుదలైన తర్వాత నాలుగు వారాలకు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేలా
నెట్ ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకోగా, అంతకంటే ముందుగానే 'లియో' ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అందుకు కారణం ఈ మూవీ రీసెంట్ గా ఆన్ లైన్ ల్ లీక్ అవ్వడమే అని అంటున్నారు. మొదటగా 'లియో' మూవీని నవంబర్ 21న ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. కానీ ఈ మూవీ ఆన్ లైన్ లో లీక్ అవ్వడంతో ముందుగానే ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 16 నుంచి 'లియో' మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం ఏమీ లేనప్పటికీ ఈ గురువారం నుంచి సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాబోతుందనే న్యూస్ వైరల్ అవుతుంది.
త్వరలోనే మేకర్స్ నుంచి ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థియేటర్స్ లో నెగిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం తలపతి ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కాగా తలపతి విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న చిత్రంగా 'లియో' సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తొలి ఆట నుంచే నెగటివ్ రివ్యూలు అందుకున్న ఈ మూవీ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.148 కోట్ల వసూళ్లను రాబట్టి తమిళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న చిత్రంగా నిలిచింది.