అక్కినేని వారసుల్లో ఆస్తి తగాదాలు.. నిజమేనా..?
ఇకపోతే కుటుంబం అన్నాక గొడవలు అనేవి సహజం అయితే వాటిని బయటికి తీసుకు రాకుండా కాపాడే వారే ఇంటి పెద్ద. ఇక నాగేశ్వరరావు ఉన్నప్పుడు అంతా మంచిగానే ఉండేది కానీ ఆయన మరణించిన తర్వాత ఆస్తి పంపకాలలో పొరపచ్చలు వచ్చాయని అన్నపూర్ణ స్టూడియోస్ నాగ్ చేతిలో నుంచి జారిపోయిందని.. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చాలా రకాలుగా రూమర్స్ చేస్తున్నప్పటికీ కూడా నాగార్జున ఏ రోజు స్పందించలేదు. తాజాగా ఈ విషయంపై అక్కినేని వెంకట్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
వెంకట్ మాట్లాడుతూ.. నాన్నగారు మా ఇద్దరిని కూడా సినిమాలకు దూరంగానే పెంచారు. మేము కూడా ఇండస్ట్రీకి దూరంగానే పెరిగాము. ఒకరోజు నేనే నాన్న దగ్గరకు వెళ్లి భయంగా ఉంది అని చెప్పాను. నాగ్ ను హీరోని చేద్దాం.. నేను నిర్మాతగా మారుతాను అని చెబితే నాన్న వెంటనే ఓకే అనేసరికి షాక్ అయ్యాను. అలా నాగార్జున హీరోగా, నేను నిర్మాతగా మారాను. ఇక నాగార్జున తో గొడవలు , ఆస్తి పంపకాలు అన్నీ కూడా అబద్ధాలే.. అందులో నిజం లేదు ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో ను నాగార్జున నే చూసుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చారు వెంకట్. ఇక వెంకట్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.