వరుణ్ పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన సాయి ధరంతేజ్..!
ఇక ఇప్పుడు తాజాగా సాయి ధరంతేజ్.. వరుణ్ లావణ్య పెళ్లి నుంచి ఆసక్తికర ఫోటోలు షేర్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. సాయి ధరంతేజ్ , వరుణ్ తేజ్ బావ బామ్మర్దులు అవుతారన్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ కజిన్స్ అంతా కూడా సరదాగా కలిసి ఎంజాయ్ చేసే ఉంటారు. ముఖ్యంగా పండుగలు, పార్టీలు వీరంతా కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సాయి ధరమ్ షేర్ చేసిన ఫోటోలో వరుణ్ కార్ లో పెళ్లి వేదిక వద్దకు వెళ్తుంటే తేజ్ మధ్యలో ఆపేసి కారు మీద కాలు పెట్టి ఎందుకు చేసుకుంటున్నావు పెళ్లి.. సింగిల్ లైఫ్ ని వదిలేస్తున్నాం అంటూ సరదాగా ప్రశ్నించాడు..
ఈ ఫోటోలను షేర్ చేసిన తేజ్ ఎందుకు ఎంత పని చేసావ్ రా వరుణ్ బాబు అంటూ ఆసక్తిగా పోస్ట్ పెట్టడం జరిగింది. ఇదంతా పెళ్లిలో సరదాగా జరిగిందని తెలుస్తోంది. మొత్తానికి అయితే ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ఇంస్టాగ్రామ్ పోస్ట్ కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.