చాలా మంది నటీమణులు ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో అను ఇమాన్యుయల్ ఒకరు. ఈ నటి తెలుగు తరపు మజ్ను అనే మూవీ తో పరిచయం అయింది. నాని హీరోగా రూపొందిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇకపోతే ఈ మూవీ లో అను తన నటనతో ... అందచందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ బ్యూటీ కి వరుసగా తెలుగు లో అవకాశాలు దక్కాయి.
ఇక తెలుగు తెలుగు పరిచయం అయిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూనే వస్తోంది. ఇక ఇలా తెలుగు లో ఈ బ్యూటీ నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ రావడంతో అను కి టాలీవుడ్ లో అవకాశాలు చాలా వరకు తగ్గాయి. అలాంటి సమయంలోనే ఈ నటికి తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి కార్తీ హీరోగా రూపొందిన జపాన్ మూవీ లో హీరోయిన్ గా అవకాశం లభించింది. ఇకపోతే కార్తీ వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉండడం ఈ బ్యూటీ తెలుగు సినిమా కాకుండా తమిళ మూవీ లో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ అయిన మంచి విజయం సాధిస్తే అను కి కనీసం తమిళ సినిమా ఇండస్ట్రీ లో అయిన ఫుల్ క్రేజ్ వస్తుంది అని చాలా మంది భావించారు.
ఇకపోతే తాజాగా జపాన్ మూవీ విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ లభించింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సినిమా ఘోర పరాజయాన్ని అందుకునే పరిస్థితిలో కనబడుతున్నాయి. కార్తీ అయిన జపాన్ మూవీ తో సూపర్ సక్సెస్ ని అను కి అందించి బ్యాడ్ లక్ నుండి బయటపడేస్తాడు అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే కార్తీ కూడా ఈ ముద్దుగుమ్మ బ్యాడ్ లక్ ను తప్పించలేకపోయాడు.