JR.ఎన్టీఆర్ కి నటనలో శిక్షణ ఇచ్చింది ఎవరో తెలుసా..?
ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్కు నటనలో శిక్షణ ఇచ్చిన వ్యక్తి భిక్షు.. ఈయన దగ్గర శిక్షణ తీసుకొని ప్రస్తుతం దేశం గర్వించదగ్గ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భిక్షు మాట్లాడుతూ.. నా దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్లు ఉన్నత స్థానానికి ఎదగాలని నేను భావిస్తాను.. పని విషయంలో నా భార్య, నా కూతురు నాకు సహాయం చేస్తారు.. నాకు 30 లక్షల రూపాయలు ఇవ్వాలని , 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన మాట్లాడుతూ నా స్టూడెంట్స్ కొంతమంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా పెట్టారు ..ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తానని.. ఎక్కువ మంది స్టూడెంట్స్ కి ఒకే సమయంలో శిక్షణ ఇస్తే ట్రైనింగ్ కి న్యాయం చేయలేమని భావిస్తానని ఆయన తెలిపారు.
ఇక బాల రామాయణం సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ పదేళ్ల వయసులో శిక్షణ తీసుకున్నాడని జూనియర్ ఎన్టీఆర్ బాగా అల్లరి అని , హార్రర్ కథలు చెప్పి పిల్లవాళ్ళను ఎన్టీఆర్ భయపెట్టేవాడని భిక్షు చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం భిక్షు చేసిన కామెంట్లు చాలా వైరల్ గా మారుతున్నాయి. నాడు ఆయన ఇచ్చిన శిక్షణ నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసిందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.