కాఫీ విత్ కరణ్ టాక్ షో పై నేచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వ్యాఖ్యాత కరణ్ జోహర్ టాక్ షోకి పిలుపు వస్తే   ఆ షోలో పాల్గొనడానికి ప్రతి సెలిబ్రెటీ బాగా ఆశక్తి కనపరుస్తూ ఉంటారు.  అలాంటిది నేచురల్ స్టార్ నాని ఆ షోకి తనకు ఆహ్వానం వచ్చినా ఆ ఆహ్వానాన్ని  తిరస్కరిస్తాను అంటూ నాని చేసిన కామెంట్స్  వైరల్ గా మారాయి. వివాదాలకు వివాదాస్పద వ్యాఖ్యలకు చాలా దూరంగా ఉండే  నాని ఇలాంటి కామెంట్స్ చేయడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.



లేటెస్ట్ గా ఇండియా టుడే నిర్వహించిన రౌండ్ టేబుల్ కాంక్లేవ్ కు ప్రత్యేక అతిధిగా హాజరైన నాని తనకు ‘కాఫీ విత్’ కరణ్ టాక్ షోకి ఆహ్వానం వస్తే నిర్మొహమాటంగా నో చెబుతానని షాకింగ్ కామెంట్స్ చెప్పేశాడు. అయితే తనకు కరణ్ మంచి మిత్రుడనీ అతడు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తనకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడనీ తామిద్దరం గతంలో ఒకటి రెండు సార్లు డిన్నర్ పార్టీలో కలిసిన సందర్భాలు ఉన్నాయని అన్నాడు.



నాని ఇంత ఓపెన్ గాఒక బాలీవుడ్ బిగ్గెస్ట్ టాక్ షో గురించి మాట్లాడటం చాలమనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కరణ్ జోహార్ టాక్ షోలో పాల్గొనే వారు కొన్ని అనుకోని ప్రశ్నలకు టార్గెట్ కావలసి వస్తుంది. ఆమధ్య కరణ్ జోహార్ రణ్వీర్ సింగ్ దీపికా పదుకునేలతో చేసిన ఇంటర్వ్యూలో రణవీర్ ఎదురుగానే దీపిక గత జీవితంలోని బాయ్ ఫ్రెండ్స్ గురించి కరణ్ అడిగిన విధానం పెద్ద సంచలనంగా మారింది.



దీనితో నాని కూడ తన వ్యక్తిగత జీవితం గురించి కరణ్ ప్రశ్నలు అడిగి తనను ఇరికిస్తాడు అన్న భయంతో నాని కరణ్ టాక్ షోని పక్కకు పెట్టాడు అనుకోవాలి. ఇదే ఇంటర్వ్యూలో నాని సూర్య నటించిన ‘జై భీమ్ మూవీకి నేషనల్ అవార్డ్ రాకపోవడం పట్ల మరొకసారి తన అసంతృప్తిని వ్యక్తపరిచి మీడియాకు హాట్ టాపిక్ గా మారాడు..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: