'దేవర' మూవీ ఆడియో రైట్స్ ధర ఎంత పలికిందో తెలుసా....??

murali krishna
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ "దేవర".. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు... ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.యుదసుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లాంచింగ్ రోజు కొరటాల శివ మాట్లాడుతూ తన కెరీర్ లోనే దేవర సినిమా బెస్ట్ మూవీ అవుతుంది అని ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశారు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని కొరటాల శివ భారీ రేంజ్ లో దేవర సినిమాను తెరకెక్కిస్తున్నారు.తాజాగా దేవర చిత్రం ఆడియో రైట్స్ కి కుదిరిన డీల్ గురించి తెలిస్తే సినిమా పై ఏ రేంజ్ లో హైప్ వుందో అర్ధం అవుతుంది.

దేవర చిత్ర ఆడియో రైట్స్ ని ఓ ప్రముఖ సంస్థ రూ 27 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇది దిమ్మతిరిగే ధర అనే చెప్పాలి. రీసెంట్ గా  అల్లు అర్జున్ పుష్ప 2 చిత్ర ఆడియో రైట్స్ 45 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్ర ఫస్ట్ పార్ట్ ఆడియో ఇండియా వైడ్ గా సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ కి కూడా బాగా కలసి వచ్చింది. పుష్ప 2 తర్వాత దేవర ఆడియో రైట్స్ డీల్ లో సెకండ్ హైయెస్ట్ గా నిలిచిందని సమాచారం.ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అనిరుద్ విక్రమ్, జైలర్ మరియు తాజాగా లియో లాంటి క్రేజీ చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. ఆ సినిమాలలో మ్యూజిక్ ఇప్పటికే ట్రెండింగ్ అని చెప్పాలి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడం అలాగే సినిమాకు అనిరుద్ మ్యూజిక్ ఇస్తుండడంతో దేవర మూవీ ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: