ఫ్యాన్స్ బాగు కోసం ఆ నిర్ణయం తీసుకున్న మహేష్?

frame ఫ్యాన్స్ బాగు కోసం ఆ నిర్ణయం తీసుకున్న మహేష్?

Purushottham Vinay
టాలీవుడ్  సూపర్ స్టార్ హేష్ బాబు అగ్ర దర్శకుల్లో ఒకడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇక మూవీ నుంచి ధమ్ మసాలా అనే సాంగ్ తాజాగా విడుదలైంది.ఈ ఫస్ట్ సింగిల్ తో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు చాలా భారీగా పెరుగుతున్నాయి.సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రమ్ ఈ సినిమాతో కచ్చితంగా మ్యాజిక్ చేస్తారని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.పాట విషయానికి వస్తే రామజోగయ్యశాస్త్రి సాహిత్యం ఈ ఫస్ట్ సింగిల్ కు హైలెట్ గా నిలిచింది. 2024 ఖచ్చితంగా సంవత్సరం ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతమంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఈ సినిమా సాహిత్యం విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన వంతు సహాయసహకారాలు అందించారని సమాచారం అందుతోంది.గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ తో మహేష్ బాబు అభిమానులు ఆశలు బాగా ఫలించాయనే చెప్పాలి. తాజాగా ఈ పాట 24 గంటలు పూర్తి చేసుకుంది.



24 గంటల్లో ఈ పాట రికార్డు స్థాయిలో 17.43 మిలియన్ వ్యూస్ రాబట్టింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ రాబట్టిన తెలుగు పాటగా ఈ పాట ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాట తరువాత కూడా వరుసగా 3 మూడు పాటలు కేవలం మహేష్ బాబువే కావడం విశేషం. Top 5 లో Top 4 సూపర్ స్టార్ మహేష్ బాబు పాటలే ఉన్నాయి. అంటే సూపర్ స్టార్ తన రికార్డుని తానే బద్దలు కొట్టుకొని ఆల్ టైం రికార్డ్ సృష్టిస్తున్నారు. అంతేగాక ఈ సినిమా ఏకంగా 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రీజనల్ సినిమాల్లో టాప్ లో నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా పోస్టర్లు ఇంకా సాంగ్స్ గమనిస్తే మహేష్ ఎక్కువగా బీడీలు కాలుస్తున్న స్టిల్స్ వున్నాయి. ఇవి ఫ్యాన్స్ కి కిక్ ఎక్కిస్తున్నాయి.అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ బాగు కోసం ఆ పోస్టర్ ని తీసేయాలని డిసైడ్ అయ్యాడట. కేవలం సినిమాని సినిమా లాగే చూడాలి. నిజ జీవితంలో పొగ త్రాగడం హానికరం అనేది మహేష్ ఉద్దేశ్యం. జనవరి నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. ఆరోజు ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ కావడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: