వార్నీ.. బిగ్ బాస్ -7 లో.. ఒకేసారి ముగ్గురు కెప్టెన్లు?

praveen
ప్రస్తుతం తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరినీ అలరించి బిగ్ బాస్ షో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఎపిసోడ్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. ఉల్టా ఉల్టా అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. దీంతో ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా.. ఈ షో చూసేస్తూ ఉన్నారు ప్రేక్షకులు. అయితే బిగ్బాస్ హౌస్ లో ప్రతివారం ఒక కంటెస్టెంట్ ఇక హౌస్ కి కెప్టెన్గా వ్యవహరిస్తూ ఉంటారు.


 ఇలా కెప్టెన్గా వ్యవహరించే కంటెస్టెంట్ అన్ని పనులను కూడా దగ్గరుండి చూసుకుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కెప్టెన్ గా ఉన్నవారు తనకు ఒక డిప్యూటీని నియమించుకొని.. ఇక ఆ ఇద్దరే చివరికి హౌస్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే గతవారం టాస్కులలో విజయం సాధించిన శోభ శెట్టి.. కెప్టెన్సీ అందుకుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు శోభా శెట్టి కెప్టెన్సీ పై మాత్రం  విమర్శలు వస్తున్నాయి. శోభ  అఫీషియల్ గా కెప్టెన్ అయినప్పటికీ హౌస్ కి ఇక సీరియల్ బ్యాచ్ అని పేరున అమర్ దీప్, ప్రియాంకలు కూడా కెప్టెన్సీ అందుకున్నారూ అన్నది స్పష్టమవుతుంది.


 ఎందుకంటే కెప్టెన్ గా అందరికీ అన్ని చెప్పాల్సిన శోభా శెట్టి.. ఇక హౌస్ లో ఎవరికి ఏం పనులు అప్పగించాలి అనే విషయాన్ని అమరదీప్, ప్రియాంక చెబుతూ ఉంటే వింటుంది. అయితే ఆటల్లో ఈ ముగ్గురు కలిసే ఆడుతారు. హౌస్ లో ఉన్నప్పుడు కలిసి ఉంటారు. కనీసం కెప్టెన్సీ అయినా కొంచెం ఫెయిర్గా చేయండి రా అంటే ఇక ఈ ముగ్గురు హౌస్ కి ఒకేసారి కెప్టెన్ అయ్యారు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇదే విషయంపై అర్జున్ కూడా ఒకరు కెప్టెన్ అయినట్టు లేదు ముగ్గురు కెప్టెన్ అయినట్లు ఉంది అంటూ కామెంట్ కూడా చేయడం గమనార్హం. దీంతో ఇక శోభాశెట్టికి ఈ వీక్ లో వరస్ట్ కెప్టెన్ అనే ట్యాగ్ రావడం ఖాయం అని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: